ఈ పుస్తకంలో వున్న మొదటి రెండు కథలూ,


బూర్జువా స్త్రీవాదుల 'స్త్రీ స్వేచ్ఛ'ని చెప్పడానికే.


''ఓపెన్‌ మేరేజ్‌ పద్ధతి'' దాకా ఎదిగిన స్వేచ్ఛా వాదం అది!


వ్యాసాలు, 5 రకాలుగా వున్నాయి.


వరూధిని గారు అనే నా కన్నా పెద్ద వయసు ఆవిడితో నా పరిచయం, మొదలైన తర్వాత మర్యాద రకంగానే నాలుగైదేళ్ళు సాగి, అది హఠాత్తుగా ముగిసింది. ఈ విషయంలో, నా మీద గందరగోళపు వార్త ఒకటి 'సారంగ' నెట్‌ పత్రికలో ప్రచారమైంది. అందుకే నేను ఆ విషయాలు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చింది. ఈ పరిచయం ఇలా ముగియడం, నాకు చాలా విచారం కలిగించింది. కానీ, అది నా వల్ల జరిగింది కాదు.


''విప్లవ రచయితల సంఘం'' మీద విమర్శలు చేస్తే, అది ద్వేషంతో చేసిన పని కాదు. ఆ సంఘం మీదే కాదు, ఏ సంఘం మీదైనా, అది తను పెట్టుకున్న సిద్ధా:త దృష్టితో నిజాయితీగా సాగాలని కోరడమే, అవసరమైతే చర్చించడమే గానీ, దేని మీదా నిష్కారణమైన ద్వేషం వుండదు. 'విరసం' మీద వ్యాసాలన్నింటినీ ఆ దృష్టితో రాసినవిగానే భావించాలి.


వర్గాల - కులాల వ్యాసాలన్నీ, 'వర్గ నిర్మూలన''ని ఆశించేవే.


సమీక్షలు జరిగిన సినిమాలు పాతవి. సినిమా పరిశ్రమలో పాతా, కొత్తా, అంతా ఒకటే. పాతవి ఫ్యూడల్‌నీ, ఈ నాటి కొత్తవి బూర్జువానీ, చూపిస్తాయి. అంతే వాటి లక్ష్యం. 


మిగతా వ్యాసాలూ, ఉత్తరాలూ, ఆ యా సందర్భాలవి.


- రంగనాయకమ్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good