''ముద్రా శాస్త్రము'' ఏ మతానికీ, ఏ జాతికీ సంబంధించినది కాదు. సకల మానవాళి సంక్షేమం కొరకు భారతీయ దార్శనికులచే రూపొందించబడినది. ఈ రోజు చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌ వంటి ఎన్నో దేశాల్లో సాధన చేయబడుతున్న 'యోగ హస్తముద్ర'లకు పుట్టినిల్లు మన భారతదేశం.

    ''ధ్యానము'' అనే పదమును చైనీయులు ''చాన్‌'' అని ఉచ్ఛరిస్తారు. కాస్త తేడాతో జపనీయులు 'జెన్‌'' అని పలుకుతారు. ''భాష ఏదైనా భావమొక్కటే''.

ముద్రల పేర్లు కూడా భాషాంతరీకరణ చెందినాయి. వాని పైన విస్తృతమైన పరిశోదనలు జరిగాయి. ముద్రలు ''యోనశ్చిత్తవృత్తి నిరోధ:'' వలె ప్రత్యక్షంగా మస్తిష్కమును శాంతింపజేసి, సరియైన ఆజ్ఞలను అందుకొని నాడుల ద్వారా సకల అంగాలనూ నిర్దేశిస్తాయి. ఈ యొక్క శాస్త్రము, వైద్య శాస్త్రమునకు ప్రత్యామ్నాయం  కాదు గానీ వివిధ స్ధాయిలలో ఆరోగ్య రక్షణకు ఉపకరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good