మనిషి నూతన జీవిగా మారే ప్రక్రియను ఈ పుస్తకం తెలియజేస్తుంది.  ఆత్మను కల్మషమైన మనసు చంపివేస్తుంది.  మంచిమనసు ఉన్నతాత్మ వైపు మనలను నడిపించి జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది.  మంచి మనసుతో ఉండడానికి నిమ్నాత్మను, స్వార్థాన్ని మనిషి వదలిపెట్టాలి.
జీవితంలోని భ్రమలను పోగొట్టుకొనటానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.  అప్పుడు మనిషి మృత్యువుకు భయపడడు.  జీవితం నిరంతరం ఆహ్వానాన్ని పలుకుతున్నట్లు భావిస్తాడు.  ఈ పుస్తకంలోని విషయాలు అన్నీ అర్థం చేసుకొన్నవారికి మనిషి ఉన్నతాత్మే భగవంతుడు అవుతుంది.  నూతన కేంద్రం సృష్టింపబడుతుంది, నూతన పద్ధతి పుడుతుంది.  మనిషఙ గర్వాన్ని అణచుకొని స్థిమితంగా ఉండగలడు.
జీవితాద్భుతాలను తెలుసుకొనే ఇందజ్రాలాన్ని ఈ పుస్తకం మీకు నేర్పుతుంది.  ఆలోచన, ఆలోచించడాలు మనసును మూసివేస్తాయి.  ఆలోచన లేకుండా, ఆలోచించకుండా ఉంటే మీ మనసు తెరచుకుంటుంది. ఈ పుస్తకం జీవితాన్ని కొత్తగా చూడడం మీకు నేర్పుతుంది.స్వాతంత్య్రం అంటే బంధనాలు లేకపోవడం కాదని, బంధనాలుండడం కూడా అని అర్థం చేసుకొనడానికి తోడ్పడుతుంది.  బంధించబడేందుకు మీకు స్వేచ్ఛ ఉంది, కనుక ఆ బంధనం మిమ్మల్ని బంధించినట్లు కాదు. మీలో మీకు 'అంతరిక ప్రదేశం' కనిపిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good