మనము రోజూ వాడే దినసరి కొవ్వు పదార్థాలలో 99% నూనే ఉంటుంది. గత 30 సంవత్సరాల నుండి జరిగిన పరిశోధనల్లో ట్రైగ్లిసరైడ్ లేదా నూనె కూడా గుండె జబ్బులు బారిన పడడానికి ముఖ్య కారణం అని చెప్తుంది. (జంతు సంబంధిత కొవ్వుతో పాటు) గత 10 సంవత్సరాలుగా జంతు సంబంధిత కొవ్వు గుండె జబ్బులకు కారణం అని నూనె కంపెనీలు. ''జీరో కొలెస్ట్రాల్'' అని అమ్ముతున్నారు. కానీ నిజానికి నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. నూనె అధిక కాలరీలు (శక్తి) కలిగి ఉంటుంది. దీని వలన అధిక బరువు, డయాబెటీస్, రక్తపు పోటు వస్తాయి.
ప్రస్తుత నాగరికత సమాజంలో, మనము ఎక్కువగా సరెండరీ జీవనశైలికి అలవాటు పడ్డాము. అధిక ఒత్తిడి, జీవనశైలి విధానం కారణంగా వ్యాధులబారిన పడుతున్నారు. మనము ఆహారంలో ఎంత తక్కువగా నూనె వాడితే అంత మంచిది. 'తక్కువ అటే జీరో'' నూనె లేకుండా వంటలు అంతే రుచిగా ఆరోగ్యంగా వుంటాయి.