''మరో ప్రపంచం మరో ప్రపంచం / మరో ప్రపంచం పలిలిచింది ! / పదండి ముందుకుపదండి త్రోసుకు / పోదాం, పోదాం పైపైకి / త్రాచుల వలెనూ, రేచుల వలెనూ / ధనంజయనిలా సాగండి / కనబడ లేదా మరో ప్రపంచపు / అగ్ని కిరీటపు / ధగధగలు ఎర్రబావుటా నిగనిగలు / హోమజ్వాలల భుగభుగలు''/

శ్రీశ్రీ కవితాప్రస్థానంలో ఇదే మొట్టమొదటి అతినవ్య కవితాఖండిక. ఇక్కడ మరో ప్రపంచం అంటే సామ్యవాద వ్యవస్థ అని చాలా మంది వ్యాఖ్యానించారు. కాని మహా ప్రస్థాన గేయ రచనా కాలంనాటికి తనకు మార్క్సిజం తెలియదని శ్రీశ్రీ యే చెప్పారు. ''మీ కవిత్వానికి మార్క్సిజంకు గల సంబంధం ఎలాంటిది?'' అన్న ప్రశ్నకు ''మహాప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజంను గూర్చి తెలియనే తెలియదు. నేను మార్క్సిజంను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానేగాని రాజకీయాల ద్వారాకాదు'' ఉన్నవ్యవస్థకంటే భిన్నమైన మానవ వ్యవస్థ కోసం అతని ఆరాటం ఆ గేయంలో అభివ్యక్తమయింది. అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు నూతనంగా ఏర్పడబోయే వ్యవస్థకు ప్రతీకలు మాత్రమే.

పేజీలు : 55

Write a review

Note: HTML is not translated!
Bad           Good