ఈ పుస్తకంలో జటిలమైన సిద్ధాంతాలు లేవు - రాద్ధాంతాలు లేవు. అర్థం కాని విషయాలు అసలు లేవు. అన్నీ మన జీవితాలకు నిలువుటద్దాలు ప్రతి రచనలో మనల్ని మనం చూసుకోవచ్చు. అవి మన ప్రతిబింబాలే. మన అంతరంగాలే. అవి నిత్యసత్యాలకు ప్రతిరూపాలు. ప్రతిబింబాలు. మానసిక విభ్రమలు అన్నీ. వాటిని అధిగమించం మన చేతుల్లో పని, మన చేతల్లో ఉంది. యోగం చేస్తున్నామని గర్వపడడం కాదు. యోగంవల్ల మనం ఎంత మారాం? ఈ అద్దంలో చూచుకుంటే తెలుస్తుంది. మన లోపాలు తెలుస్తాయి. వాటికి 'దిద్దుబాటు' మన ప్రయత్నంలో ఉంది. మన ప్రవర్తన మారితే పరివర్తన కలుగుతుంది.
నన్ను ఉద్ధరించమని మాస్టరుగారిని అర్థించడం తప్పు కాదు. కాని నేను మారడానికి సిద్ధంగా ఉన్నానా? నా ప్రయత్నం ఎంత? మనకు తెలియకుండా మనలో లోపాలు చాలా ఉంటాయి. వాటిని మనమే Adjust (దిద్దుబాటు) చేసుకోవాలి. తర్వాత Rectification కోసం మాస్టర్‌ గారిని అర్థించాలి. మనల్ని తీర్చిదిద్దడం గురువుల బాధ్యత. ఇప్పుడు అలాంటి గురువులు లేరు. అందుకు అర్హులైన శిష్యులు కనిపించరు. అంతా Self study. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడడం. మన చేతులకు మట్టి అంటకూడదు. మనం కష్టపడకుండా ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా కలగాలి. అత్యాశ.
Self Rectificationకి ఈ పుస్తకం గైడ్‌లా ఉపకరిస్తుంది. లోపాలనూ చూపిస్తుంది. వాటిని దిద్దుబాటు చేసుకునే పద్ధతుల్ని చూపిస్తుంది. ప్రతి అంశాన్ని విశ్లేషించుకోవచ్చు. అవసరమైన మార్పులు చేసుకోవచ్చు మన భావోద్వేగాలకు కరకట్టలు వేసుకోగలగాలి.
అందుకు ప్రేమ, కరుణ, దయ, భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉపాధులు.
Rectification is based on Self Help.
- శార్వరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good