యోగ అనేది కూడా స్పిరిట్ ఆఫ్ రిలిజియన్కు సంబంధించిన అంశం. మనిషి హృదయంలో, మనస్సులో పరివర్తనను పెంపొదించే ప్రక్రియ. మనస్సు అంటే ఏమిటి, మనస్సు చంచలతను ఎలా అధిగమించాలి, మానసిక చింతనల నుంచి ఎలా బయటపడాలనే విషయాలే చర్చిస్తుంది. అంతేకాని ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఫిజిక్స్ అనేది పదార్థ భౌతిక అంశాలకు సంబంధించిన శాస్త్రం. యోగ అనేది శరీరం, మనస్సు, హృదయం, ఆత్మలకు సంబంధించిన శాస్త్రం. ఏ శాస్త్రానికి సంబంధించిన అంశాలనైనా కేవలం కంఠస్తం చేసినంత మాత్రానా అనుభవంలోకి రావు. ఆచరణలో పెడితేనే అనుభవ పూర్వకంగా తెలుసుకోగల్గుతాం.
ఆధ్యాత్మికత అనేది ఒక జీవిత శాస్త్రం. ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలను జీవితానికి అన్వయించుకోవాలి, అనుసరించాలి.
ధ్యానం సాధన చేయడం వలన మనలోని సంస్కారాలు, వాసనలు తొలగి మనస్సు స్వచ్ఛమవుతుంది. దు:ఖం, బాధల నుంచి విముక్తులమవుతాం. ప్రతి ఒక్కరూ ఈ స్థితిని చేరుకోవడానికి యోగలో కొన్ని ప్రక్రియలను వివరించడం జరిగింది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది అంశాలతో కూడిన ప్రక్రియే యోగ.
Pages : 120