యోగాభ్యాసం ఋషుల సంస్కృతి, సంప్రదాయము మరియు జీవన విధానము. భారతీయ అద్వితీయమైన ఈ విజ్ఞాన రహస్యాలు ఎప్పటినుండో కనుమరుగై ఉన్నాయి. శక్తివంతమైన ఈ విజ్ఞానం ఎలా లభించిందో, ఎప్పుడు జన్మించిందో ఎవరికీ ఖచ్చితముగా తెలియదు. ఎవరికి దీని పుట్టుక అంతు దొరకడం లేదు.

సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు, ప్రారంభకులకు పరిచయం, అవగాహనకు ఉపయోగకరంగా ఉండునట్లు సశాస్త్రీయ సులభ యోగాసనాభ్యాసం కొరకు రచించబడినది. యోగ సాహిత్యాన్ని విస్తృతంగా మరింత ప్రజా బాహుళ్యానికి చేరువ చేయడానికి ఈ రచన తోడ్పడుతుంది.

ఈ పుస్తకము నందు వివరించిన విధంగా నిర్ధేశాలను పాటించి నిరంతరం అభ్యాసం చేయువారికి ఆయా ఫలితములు తప్పక లభిస్తాయి. అనేక విషయాలను కూలంకుషంగా పరిశీలించి సాధన అందరికి యోగ్యమైన రీతిలో రచించారు రచయిత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good