'యోగ థెరపి' అనే మాట 'పతంజలి'కి తెలిస్తే చాలా బాధపడతాడేమో. యోగ ఆసానాలని శారీరక వ్యాయామం అన్నా, ప్రాణాయామాన్ని బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజ్‌ అన్నా, ధ్యానాన్ని మానసిక వ్యాయామం అన్నా ఈ పుస్తకంలోని కొన్ని కొన్ని వ్యాఖ్యానాలని చూసినా ఆయన మనస్సు బాధపడటం ఖాయం. ఎందుకంటే యోగ అనే పదం ఈ రోజుల్లో చాలా 'లూజ్‌'గా వాడబడుతోంది. ఇంకా చెప్పాలంటే యోగని చాలా వ్యాయామ పద్ధతులతో కలిపి అల్లేస్తున్నారు. నిజమేనేమో అనిపించేంత అందమైన పేర్లు పెడుతున్నారు. చాలా విచిత్రమైన పేర్లు పెడుతున్నారు.

'కరో యోగ', 'ఏరో యోగ' అని కరాటే యోగ కలిపి 'కరో యోగ' అంటున్నారు. ఏరోబిక్స్‌, యోగల మేలు కలయిక 'ఏరోయోగ'. ఇలా యోగని చాలా రకాలుగా వాడటం జరుగుతుంది. ఇక 'యోగ థెరపి' మన దేశంలో కంటే విదేశాల్లో బాగా వాడుకలో ఉంది. యోగని వాళ్లు ఒక 'కాంప్లిమెంటరీ మెడిసిన్‌'గా తీసుకుంటారు. యోగ పద్ధతులలో అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానంతో చాలా వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు. లేదా అదుపులో పెట్టొచ్చు లేదా మన ఇమ్యూన్‌ సిస్టంని మరింత వృద్ధి పరుచుకోవచ్చు అని శాస్త్రీయంగా నిరూపించారు వాళ్లు.  మన దేశంలో కూడా చాలా 'యోగ సెంటర్ల'లో ఈ 'వైద్య విధానం' ద్వారా చికిత్సలు చేస్తున్నారు...

Pages : 119

Write a review

Note: HTML is not translated!
Bad           Good