భారతీయ చింతనలో సాటిలేని స్థానమాక్రమించిన భగవద్గీతను భౌతికవాద కోణం నుంచి పరిశీలించిన రచన ఇది. మతపరమైన, ఆధ్యాత్మికమైన విశ్వాసాలనూ, పురాణాలు ఇతిహాసాలనూ శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేసి రాసింది. దీన్ని రచించిన వి.ఎం. మోహన్రాజ్ గ్రంథాలయ నిర్వహణలో చిరకాలం కీలక బాధ్యతలు నిర్వహించిన అధ్యయన శీలి.