“మనిషన్నాక కాస్తంత కళాపోషణ వుండాలి. ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు థియరీయే నాది కూడా- ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళయినా వుండు. నాకభ్యంతరం లేదు. కానీ విధిగా నువ్విక్కడ ఓ పని చేయాలి...” అన్నాడు ఆయన.
”ఏంటా పని?”
”ఇక్కడున్నప్పుడే నువ్వు ఎవర్నో ఒకర్ని ప్రేమించడం, ఆ ప్రేమ పెళ్ళి నా చేతులమీదుగా జరగడం...” అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ శశిభూషణ్ని చూసి ఆపేశాడు శ్రీగారు.
”మామయ్యా! మీ ప్రేమ సిద్దాంతాలన్నిటినీ పాపం కాళీచరణ్ మెదడులోకి ఎక్కించేశారా?” శశిభూషణ్ అడిగాడు కాళీచరణ్ కేసి జాలిగా చూస్తూ.
మర్నాడు పది గంటలకు హోటల్ రూమ్ లోంచి బయటికెళ్ళిన అర్చన, హోటల్కి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చింది.
”డాక్టర్ మధురిమ, రెసిడెన్స్ జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 71లో వుంది. సెక్యూరిటీ వాళ్ళ ద్వారా కనుక్కుని మధురిమ ఇంటికెళ్ళాను. అక్కడి వాచ్మన్ ద్వారా విలువయిన సమాచారం తెలిసింది.”
”ఏంటది?” ఆతృతగా అడిగాడు రణదీప్.

Write a review

Note: HTML is not translated!
Bad           Good