భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలతో సహా స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బి.సి., మహిళలకు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించాయి. విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్‌లు కొనసాగుతూనే వున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో షెడ్యూల్‌ తెగలు, కులాల వారికి కేటాయించబడిన రిజర్వేషన్లు అనేక సామాజిక కారణాలు, వ్యవస్థాగతమైన లోపాలవలన ధనిక, అగ్రకుల పెత్తందార్ల చేతుల్లోకి వెళ్ళి దుర్వినియోగం కావటం చూస్తున్నాం. రిజర్వేషన్లు అపహాస్యం కావటాన్ని గమనిస్తున్నాం.

ఈ అంశం మీద పరిమితంగానైనా తెలుగులో సాహిత్యం వెలువడింది. ఇప్పుడు అభ్యుదయ రచయిత, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ మనకు ఇదే అంశంపై 'ఏడుగుడిసెల పల్లె' నాటకాన్ని దృశ్యమానం గావించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఆయా సామాజిక వర్గాల చేతుల్లో ఆయుధమై, ఆ వర్గాలు సామాజిక అభ్యుదయం సాధించాలనేది శివప్రసాద్‌ ఆశయం. ఆ దిశలో సాగిన 'ఏడుగుడిసెల పల్లె' నాటకాన్ని అరసం గుంటూరు జిల్లా శాఖ ప్రచురిస్తుంది.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good