'ఏది నీతి? ఏది రీతి?' పుస్తకంలో హేతువాది మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసాలు, అంతకుముందు అబద్ధాల వేటలో ప్రచురితమైనవి, ఆ తర్వాత వచ్చినవి వున్నాయి. ఇన్నయ్యగారి కలానికి కాలపరిమితి లేదు. అందుకే ఈ వ్యాసాలు నాటి నుంచి ఈ నాటి దాకా మానవవాద విషయాల్ని, విశేషాల్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి.

ఏది నీతి? ఏది రీతి? అనే ఈ పుస్తకంలో నాగరీకుడయిన మనిషి ఆచరించాల్సిన జీవన విధానం వుంది. నమ్మాల్సినవి ఏమిటో, విడనాడాల్సినవి ఏమిటో హేతబద్ధంగా వివరించారు రచయిత. ఈ వ్యాసం పరాన్నభుక్కులయిన ఒక సెక్షన్‌ ని ఇబ్బంది పెడతాయి. వారిబారిన పడిన అమాయక ప్రజల్ని ఇవి రక్షిస్తాయి. ఇలాంటి రచనలు ఈ సమాజానికి అవసరం.

ఇసనాక మురళీధర్‌

Pages : 255

Write a review

Note: HTML is not translated!
Bad           Good