నేటి బాలలే రేపటి పౌరులు అనేది మన నినాదం ! పుట్టిన ప్రతీ మనిషికి ఏదొక ప్రత్యేకత వుంటుంది. పుట్టుకతో ఎవరూ మేధావులు కారు. పెరుగుతున్న కొద్ది వారి నడవిడికే వారి జీవితాన్ని సార్ధకం చేస్తుంది. అందుకే పూరం మహార్హులు మానవజీవన సరళిని  మూడు మాటల్లో చెప్పారు. అవే ధర్మార్ధకామాలు, అంటే ధర్మం , అధర్మం , కామం. ధర్మం అంటే ఊహతెలిసిన నాటి నుండి చక్కని విద్యాబుద్దులతో ప్రతి విషయం లో ధర్మం గా వ్యవహరించడం. అర్ధం అంటే ఆర్ధిక వసతి.కామం అంటే కోరిక , అన్ని కోరికల కన్నా యవ్వన కోరిక బలీయమైనది. ప్రక్రుతి సహజమైన కామ కోరికలను ధర్మ బద్దంగానే తీర్చుకుంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. పదమూడు సంవత్సరాల నుండి పొందోమ్మిదో సంవత్సరం వరకూ టీనేజ్ గా నిర్ణయించారు పెద్దలు. అక్కడ నుండి వయసు ఆరంభం అవుతుంది. టీనేజ్ నుండే శారీకంగా మానసికంగా ఎన్నో మార్పులు కలుగుతూ అన్ని విషయాల పట్ల వారికి కొంత అవగాహన్ ఏర్పడుతూ వుంటుంది. స్వంత భావాలు నిర్ణయాలు చోటు చేసుకుంటూ వారి ప్రవర్తనను నిర్దేశిస్తూంటాయి. ఈ వయసు లో ఎదుగుదల , చక్కని విద్య, మంచి నడవడిక భవిష్యత్ కు బంగారు బాట వేస్తాయి. జీవితంలో మంచాయినా, చెడయినా టీనేజ్ మీదే ఆధారపడి వుంటుంది. ఈ విషయాన్ని టీనేజ్ లోకి అడుగు పెట్టిన ప్రతివారూ గట్టిగా నమ్మాలి. టీనేజ్ లో ఎన్నో రకాల అలజడులు, ఆందోళనలు, రకరకాల మానసిక చర్యలు జరుగుతుంటాయి. వాటి మీద తగిన అవగాహనను కలిగించుకుంటూ ఏ సమస్య నైనా వారి మటుకు వారు పరిష్కరించు కునే విజ్ఞాన్నాన్ని పెంపొందించుకోవాలి. టీనేజ్ వారికి , తల్లి దండ్రులకు , గురువులకు గైడెన్స్ చాలా అవసరం. ఈ చిన్న పుస్తకంలో టీనేజ్ కు సంబంధించిన ఎన్నో విషయాలను వివరించడం జరిగింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good