''యశోధరా! ఇంక ఈ డొల్లతనంలో నేను ఇమడలేననిపిస్తున్నది. సమస్త భోగాల మీదా అసహనం కలుగుతున్నది. నీ బంధ మొకటే నన్ను ఇంకా పట్టి ఉంచుతున్నది. బిడ్డపుట్టిన తరువాత అదీ ఒక బంధమై పెనవేసుకుంటుందేమో''
యశోధర చాలసేపు ఆలోచనలో మునిగి చివరికిలా అన్నది.
''మానవ దు:ఖం గురించి ఆలోచిస్తున్నారు. మానవులందరి పట్లా మీకొక బంధం ఏర్పడినట్లు తోస్తున్నది. నన్నూ మన బిడ్డనూ కూడా ఆసమూహంలో కలపండి. ఇక అప్పుడే సంకటమూ ఉండదు.''
పేజీలు : 119