'ఏమిటాలోచిస్తున్నావ్‌ ?''  అలవోకగా పక్క మీదకు వాలి అంది అమ్మాయి. మాట్లాడలేదు నేను - ఆమెనే చూస్తూ వుండిపోయేను. చీరెకి, జాకెట్టుకి మధ్య, సముద్రపు తీరానే స్థిరంగా నిలబడి యుగయుగాలుగా, ఆ అలల తాకిడికి సున్నితత్వాన్ని ఆపాదించుకున్న కొండరాళ్ల నునుపు సెక్స్‌ కాదు, ఉద్విగ్నత.

''ఏమిటి కొంపదీసి ఈ గంటా యిలా ఏదో ఆలోచిస్తూనే గడిపేస్తావేమిటి బాబూ?''

అడుగు ముందుకేసి - ఆమె చేరువై - ఆ స్పర్శలో - ఆ గుండె చలనపు సవ్వడి. తరతరాలుగా స్త్రీని పురుషుణ్ణి ఏకం చేసే రాగబంధం - లయ. ఏ వాద్యకారుని వేళ్లు సుతారంగా మీటుతున్నాయో -

ఆమె చెయ్యి లైట్‌ మీదకు వెళ్లబోయింది - వారించాను. లైటార్పితే - ఇంత ఆనందం ఎక్కడుంది ?........

అతడు ప్రకాశం. అతడు ప్రేమించిన అమ్మాయి. అతడ్ని ప్రేమించిన మరో అమ్మాయి. ఈ వలయం నుంచి చూస్తే అన్నీ సజావైన ప్రేమ వ్యవహారాలే. కానీ హిపోక్రసీ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నవ నాగరికతలో ఈతడు ఇమడలేకపోయాడు. ఆత్మవంచనతో బతకలేకపోయాడు. ఐయామ్‌ ఆల్సో బికమింగ్‌ ఎస్కేపిస్ట్‌ లైక్‌ యు!- అననైతే అన్నాడు కానీ - చెడిపోవడం కూడా అందరికీ చేతకాదు. అదీ ఒక ఆర్టు! మన బ్రతుకుల్లోని వంచనాశిల్పాన్ని ఎత్తిచూపే యండమూరి వీరేంద్రనాథ్‌ సమస్యాత్మక నవల - ఋషి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good