నా పేరు సుకుమారి ! నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ! కాని నా  జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోనా  వయసు ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగనే  మూగగా యీ జీవితంలో యీ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలుసు. మీరూ ఒప్పుకుంటారు..
ఆడపిల్ల అనగానే వీరందరికీ ఎంత చులకన!
"ఆడవాళ్ళు ! వాళ్ళ మొహాలు ! వాళ్ళెం చేస్తారు ? పిల్లల్ని కనటానికి తప్ప వల్లెందుకూ పనికి రారు " అంటూ కొంతమంది తీసిపారేస్తారు .అలా అన్నవాళ్లు ముక్కు మీద ఫేదిమని ఒక్కటి కొటాలనిపిస్తుంది నాకు...
ఇలా సుకుమారి తన కథను తానె చెప్పుకుంది. పుట్టిన ఇదో రోజున ఉయ్యాలలో పడుకోబెట్టి గరకు దుప్పటి వేస్తె కొద్ది సేపట్లో ఒళ్ళు ఎర్రగా కందిపోయిందట. అందుకే బామ్మ ఆ పిల్లకి సుకుమారి అని పేరు పెట్టించింది. సుకుమారి పెంకి పిల్లలాగే పెరిగింది. కమలమ్మత్తయ్య కొడుకు బ్రాహ్మీ (బ్రహ్మానందం ) సుకుమారి జట్టు. అతడికి సుకుమారి అంటే ఇష్టం. అయితే తెలిసీ తెలియని వయసులో సుకుమారికి వరప్రసాద్ తో ఇమడ లేకపోయింది. సుకుమారిని అడిగితె అది ఇల్లు కాదు నరకం అంటుంది. ఏమైతేనేమి బ్రాహ్మీ వచ్చి సుకుమారిని ఆ నరకం నుండి బయటకు తీసుకు వెడతాడు. ఆ తర్వాతి కః నవలలో చదవాల్సిందే.
పెళ్లి పెనిమిటి గుదిబండలుగా మారితే వాటిని మోస్తూ ఆడపిల్లలు జీవచ్ఛవాలుగా బతకనాక్కర్లేదని భరోసా ఇచ్చే సందేశాత్మక నవల

Write a review

Note: HTML is not translated!
Bad           Good