గిరిగారు అనునయంగా చెప్పారు. కృష్ణ భర్తని చంపిందనే అపవాదు నెత్తిన పడిన రాధ నీకు తనని గురించిన ఏ విషయమూ తెలియపరచ వద్దని మాట తీసుకింది. కేసు విచారణ జరిగి  వరహాల రావుకీ దుర్గంమకీ శిక్ష పడినా ఇదంతా రాధా తరపున మేము చేరి కేసుని గోల్ మాల్  చేశామని , రాధకి శిక్ష తప్పించామని లోకం మమ్మల్ని కూడా అడిపోసుకుంది ! అందులోనూ నువ్వు వెళ్ళిన కొత్త ! నీకు ఇదానా తెలిస్తే నీ పనిమీద ఏకాగ్రత పోయి ఎక్కడ వ్యాకుల పడతావోనని సంకోచించాము .
ఇప్పుడు రాధ ఎక్కడుంది.
ఆ భగవంతుడికే తెలియాలి ! కేసు అయిపోగానే సీతారామపురం వెళ్ళింది.
అక్కడ ఒక ఆర్నెల్ల పాటు వుంది. రజనికి అడపా తడపా ఉత్తరాలు వ్రాస్తూనే వుంది ఆఖరి సారిగా ఒక ఉత్తరం వచ్చింది. రజనీ ఏదమ్మా ! ఆ ఉత్తరం తీసుకురా ! అన్నారాయన...
రాధ  - కృష్ణ - వారిద్దరూ చిన్నతనం నుంచీ మంచి స్నేహితులు. భార్య భర్తలు కావాలని అనుకున్నారు. అయితే విధి వారిద్దర్నీ విడదీసింది. పసితనంలో వాళ్ళు కట్టుకున్న ముచ్చటైన పిచ్చుకగూళ్లు చెదిరి పోయాయి. రాధకి వేరొకరి తో అనుకోని పరిస్థితులలో పెళ్లైంది. కృష్ణ దేశాంతరం పోయాడు. కానీ ప్రేమ బలీయమైంది. యంతటి ఉప్పెనల నైన ఎదుర్కొంటుంది.
రాధ కృష్ణుల మళ్ళి ఎలా ఒక్కటయ్యారు ? అడుగడుగున సస్పెన్స్ తో లక్షలాది మంది పాఠకులను ఆకట్టుకున్న యద్దనపూడి సులోచనా రాణి నవల - రాధా కృష్ణ, ఇది ఆంధ్రజ్యోతి వా పత్రిక సీరియల్

Write a review

Note: HTML is not translated!
Bad           Good