ఆటను పాట పాడినా, కొట్టినా , ఏడిపించినా అది తనకి అద్భుతంగానే ఉంది ! ప్రజ్ఞ మనసులో మాటిమాటికీ అరవింద్ రూపమే ప్రత్యక్షం అవుతుంది.
ప్రజ్ఞ మనసులో చేతులు జోడించింది. 'బావ ! వెళ్ళిపో బావ ! ప్లీజ్ ! ణా మనసులోంచి వెళ్ళిపో ! అలా ఎదురుగా నిలబడి నన్ను నిలదీయకు. నీకు దణ్ణం పెడతాను. ఇన్నాళ్ళు మీర్ నన్ను మనిషిలా చూడలేదు చాలా కృతిమ వాతావరణంలో పెంచారు నన్ను... '
విశాఖపట్టణానికి ౩౦ కి.మీ ళ దూరంలో సముద్రంలో ఓ దీవి బయట పడుతుంది. దానిని కొందరు సుప్రసిద్ధ వ్యక్తులు , ప్రవాస భారతీయులు కలిపి ఓ అద్బుతమైన విహారయాత్రా కేంద్రం గా మార్చేసి ప్లెజర్ ఐలాండ్ అని పేరు పెడతారు. ప్రముఖ వ్యాపార వేత్త గజక్ర్నం తన క్కాబోయే అలుదు అరవింద్ తో పాటు తన కూతురు ప్రజ్ఞ ణి అక్కడకి విహార యాత్రకి పంపుతాడు. వెల్ల బయలు దేరిన స్తీమర్లోనే వ్యఘ్రమూర్తి అనే ఓ ప్రభుత్వ అధికారి, ఆయన గర్ల్ ఫ్రెండ్ అమృత ఉంటారు.
ఆ ఐలాండ్ లో ఏమైనా అవినీతికరమైన పనుకు జరుగుతున్నాయేమో ఆరా తీయడానికి జ్ఞానేశ్వరి దేవి అనే స్రీ సంక్షేమాదికారి కూడా వెళుతుంది. వీళ్ళే కాక ఓ పఠశాల హెడ్ మిస్ట్రెస్ భారతి , ప్రఖ్యత పాప్ సింగర్ సుమన్ కూడా ప్లెజర్ ఇల్యాండ్ కు బయలు దేరతారు. వీళ్ళంతా ఆ దీవికి చేరినప్పటి నుండి జరిగిన సంఘటనల సమాహారమే యద్దనపూడి సులోచనా రాణి రొమాంటిక్ ధ్రిల్లర్ నవల పేమపీఠం