చెందు నీరసంగా వచాడు. దానితో ఒకటే శాపనార్ధాలు. అసలే నల్లటి మనిషి , అందులో ఎత్తు పళ్ళు . కాస్త ఎత్తు. ముఖం ఎంతయినా వికారంగా అన్పిస్తుంది.
సవితకి తన మీద తనకే అపరితమైన జాలి వేసింది. వెల్లువలా సానుభూతి పొంగి వచ్చింది. ఛీ ! ఏం మొగుడు. వద్దు మొర్రో అంటుంటే వినకుండా అమ్మ అన్నయ్య కలిసి కానీ కట్నం ఇవ్వనవసరం లేదు కదా అని ఈ మృగానికి తనని కట్టబెట్టారు. ఈ గంగిరెద్దు ఎవరో కాదు. స్వయంగా తనకి మేనత్త కొడుకే ! ఈ చంద్రమోహన్ చిన్నప్పటినుంచీ అంతే ! అడంగిలా వాళ్ళమ్మ వెనుక చేరి ఇంటి పనుల్లో సాయం చేయమంటే ఫస్ట్.
తను ఎండమావుల వెంట పరుగేడుతోందన్న సంగతి తెలుసుకోవడానికి సవిత కి చాలా సమయమే పట్టింది. అందం, ఆకర్షణ, గ్లామర్ , పేరు లాంటి వాటిని నమ్ముతూ బ్రతికేవారు ఎప్పుడో ఒకప్పుడు బంగపడక  తప్పదు . పెళ్లి , పిల్లలు లేని లోటు ఈ ప్రంపంచంలో ఏదీ తీర్చలేదు. ఈ బందం జీవితానికి ఇరుసు లాంటిది. అది లేకపోతె చక్రం ఉండదు. గమనమూ ఉండదు. జీవితంలో ఈ రెండింటి అవసమేమిటో చిత్రించే యద్దనపూడి సులోచనా రాణి నవల   పెళ్లి !+ పిల్లలు !! = జీవితం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good