"...పది సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు నీతో మళ్ళి పెళ్ళా ! ఇది జరిగే పనేనా !
రాంబాబు ముఖం ఎర్రబడింది. ఆగ్రహం అదిమిపెట్టాడు.
"ఈ విషయం నీతో సంబంధం పెట్టుకునే టప్పుడు నీక గుర్తు రాలేదా! అంత నీతి గలదానివి. అంతనంటే అంత గౌరవం ఉన్నదానివి, నన్నెందుకు తిరస్క రించలేక పోయావు? నీ కడుపులో పెరుగుతున్ననా  శిశువుని  సత్యం సంతోషంగా చెలామణి చేయటం నీకు న్యాయంగా ఉందన్నమాట.
"నువ్వు ఈ కుశంకలన్ని మానేయి! నీ మనసులో అసలు భయం నాకు తెలుసు, పరువు మర్యాద కోసం పెనుగులాడు తున్నావు నువ్వు. అవి మనిద్దరి సంతోషం కంటే విలువైనవి కావ. సత్యం వెళ్ళి పోమన్నపుడు నీకింక సందేహం ఎందుకు?
"పార్ధు వున్నాడు. వాడినేం చెయ్యను. వాడు తండ్రిని విడిచి రాదు"
పెద్దవాళ్ళ చేడునడతలకు పిల్లలు ఎలా బలి అవుతారో చిత్రించే నవల పార్ధు . ఓ పదకొండేళ్ళ పసివాడు. తల్లి లక్ష్మి, తండ్రి సత్యం. లక్ష్మి పిన్ని కొడుకుకని చెప్పుకుని రంగ ప్రవేశం చేస్తాడు రాంబాబు. అతడొట్టి జులాయి మనిషి. లక్ష్మి కి రాంబాబుకి  అక్రమ సంబంధం ఏర్పడుతుంది. వారిద్దరూ కలిసి ఉండగా , అది ఒకనాడు పార్ధు కంటపడుతుంది . అక్కడి నుండీ ఆ పసి మనసులో అలజడి మొదలవుతుంది.
పెద్దవాళ్ళ అనైతిక వర్తన పసి హృదయాలనేలా ప్రవ్యలు చేస్తుందో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించే యద్దనపూడి సులోచనా రాణి నవల - పార్ధు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good