విజయ్ హఠాత్తుగా లావణ్య మీద శ్రద్ధ కనబరచా సాగాడు. లావణ్య ని తమాషా చేయటం, ఏడిపించటం. ఆ ఇంటికి అతనంత ఎక్కువగా రావటానికి లావణ్య కారణ మేమోనన్న అనుమానం చూసేవాళ్ళకి కలిగేలా ప్రవర్తించసాగాడు. మొదట్లో విజయ్ తన పట్ల చూపుతున్న ఈ అభిమానానికి లావణ్య ముగ్డురాలయింది. ఏంతో ఆనందించింది. ఇన్ని రోజులు విజయ్ తనని గుర్తించి దగ్గరగా వస్తున్నందుకు ఎంతో మురిసిపోయింది. కానీ ఆ మురిపెం ఆవిరి అయిపొవటానికి ఎన్ని రోజులో పట్టలేదు. లావణ్య లో వున్నా స్రీ సహజమైన చాతుర్యం విజయ్ అంతర్యం లో ఉన్న అసలు బావాన్ని యిట్టె పసిగట్టింది. విజయ్ తన దగ్గర కూర్చుంటాడు. నిజమే కాని, అతని కళ్ళు అనుక్షణం రోజా కోసం వెతుకుతూ వుంటాయి. విజయ్ . రోజాని ఇష్టపడతాడు. లావణ్య కది చెప్పలేనంత అసూయని కలిగిస్తుంది. రోజా మీద ద్వేషం పెంచుకుంటుంది. రోజా వేణు గోపాల రావు ఇంట్లో ఉద్యోగానికి చేరుతుంది. వేణుగోపాల రావు కూతురే లావణ్య. అయితే వేణుగోపాలరావు రోజాను ఆదరిస్తాడు. పెడదారి పట్టిన తమ్ముడు చంద్రాన్ని మంచిగా మార్చుకోవటానికి తపన పడుతుంది రోజా. ఒక దశలో రోజాకీ విజయ్ కీ నడుమ అపార్ధాలు ఏర్పడతాయి.
ఒక్కక సంఘటనా ఒక్కో తరంగం. మనిషి జీవితంలో ఇలా ఎన్నో తరంగాలు, అదృష్ట దురదృష్టాలు , జయా పజయాలూ, ఆశ నిరాశాలూ , ఎగుడు దిగుళ్ళు , కలిమిలేములూ - వీటన్నిటినీ మనిషి అనుభవించవలసిందే . అయితే జీవితానికి పరిపూర్ణత్వం ఎలా కలుగుతుంది ? ఆ జీవన పరిపూర్ణత అంటే ఏమిటో చెబుతుంది. శ్రీమతి మద్దనపూడి సులోచన రాణి గారి నవల జీవన తరంగాలు సినిమా గానూ వచ్చిన సూపర్ హిట్ వవల ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good