ఆంధ్రప్రదేశ్‌ అవతరణ స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. తెలుగువారి తరతరాల తపనకు చిరకాల స్వప్నాలకు, ఎందరెందరో మహనీయుల త్యాగాలకు, ఆశలకు, ఆశయాలకు ప్రతీక ఈ సమైక్య రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్‌ సాధనకు ముక్కలు చెక్కలైన ముక్కోటి ఆంధ్రులను ఒక్కటి చేయు ఉద్యమాన్ని, రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి నేటి వరకు జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య పరిణామాల్ని తెలుసుకోవడానికి, అవగాహన కల్పించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపకరించే ఏకైక తెలుగు దినపత్రిక 'విశాలాంధ్ర' మాత్రమేననడంలో అతిశయోక్తి లేదు. విశాలాంధ్రలో ప్రచురితమైన ''అక్షరాక్షరం అభ్యుదయమే'.

తెలుగువారి జీవితాలతో మమేకమైన విశాలాంధ్ర దినపత్రికలో గత యాభైయేళ్ళ కాలంగా వెలువడిన సాహిత్యాన్ని మిత్రులు డా|| తాటి శ్రీకృష్ణగారు పుస్తకంగా తీసుకురావడం ఎంతో సంతోషదాయకం. సాహిత్య రంగంలో విశాలాంధ్ర నిర్వహించిన అనితర సాధ్యమైన పాత్రకు అక్షరాకృతి కల్పించడం ప్రశంసనీయం. కందుకూరి సంఘ సంస్కరణోద్యమం, గిడుగు భాషోద్యమం, గురజాడ సాహిత్య సంస్కరణోద్యమం అందించిన స్ఫూర్తితో అభ్యుదయ సాహిత్యోద్యమం తెలుగు సాహిత్యాన్ని కొత్తదారులు పట్టించింది. ఆ ప్రయత్నానికి, ఆ కృషి కొనసాగింపుకు విశాలాంధ్ర బలమైన సాధనంగా ఆయుధంగా నిలిచింది. సంప్రదాయ కవిత్వోద్యానవనాల వెంట తిరుగాడే యువకవి భావుకులకు మార్క్సిజంను, మానవీయతను ప్రబోదించి అభ్యుదయ పథంలో నడిపించిన పత్రిక విశాలాంధ్ర.

క్షీణ శక్తులను, కళా కాలుష్యాన్ని తిప్పి కొడుతూ సమాజ ప్రగతికి, సామాన్యుని అభ్యున్నతికి దోహదపడే సామాజిక, సాహిత్య సంస్కృతిని పెంపొందించడానికి అహరహం సేవలందిస్తున్న పత్రిక విశాలాంధ్ర.

ముత్యాల ప్రసాద్‌

       సంపాదకులు, విశాలాంధ్ర దినపత్రిక, విజయవాడ

Pages : 272

Write a review

Note: HTML is not translated!
Bad           Good