వైయస్సార్తో... ఉండవల్లి అరుణ కుమార్ (కొన్ని సంఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు)
పాదయాత్ర
మండుటెండలో వైఎస్ పాదయాత్ర గోదావరి తీరానికి చేరుకొంది. ఆ రోజు మధ్యాహ్నం కొవ్వూరు నుండి రాజమండ్రికి నడుస్తూ గోదావరి నదిని చూసారు వైఎస్. అంత వేసవిలో కూడా రాజమండ్రి దగ్గర గోదావరిలో అన్ని నీళ్ళు చూసి ఆనందపడిపోయారు. రాజమండ్రిలో గోదావరి పూర్తిగా ఎండిపోవటం జరగదనీ అయిదుమైళ్ళలో ధవళేశ్వరం ఆనకట్ట వుండటం వల్ల ఈ మాత్రం నీరు ఎప్పుడూ నిల్వవుంటుందనీ చెప్పాను. ఈ లోపులో కొందరు గోదావరిలో దిగి ఈతలు కొట్టడం ప్రారంభించారు. వాళ్ళ ఆనందం చూసి వైఎస్ చిన్నపిల్లాడిలా మారిపోయారు. అంతమంది జనం, పాదయాత్ర గోదావరి బ్రిడ్జి మీద కెక్కేటప్పటికి చేసిన ప్రత్యేక ఏఆర్పట్లూ, అన్నీ పక్కన బెట్టి తనూ గోదావరిలో దిగిపోయారు. 'నడినెత్తిన సూర్యుడుండగా గోదావరిలో దిగకూడదు సార్' అని నేనెంత మొత్తుకున్నా వినలేదు. మిట్టమధ్యాహ్నం గోదార్లో మునిగితే ఆరోగ్యానికి మంచిది కాదంటారు వద్దువద్దని వారించినా వినకుండా నీళ్ళల్లోకి ఉరికేసారు!
ఆ రోజు గోదావరి రోడ్-కం-రైల్ బ్రిడ్జి మీద జనప్రదర్శన మొత్తం పాదయాత్రకే హైలెట్! జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కంపూడి రామమోహనరావు, ఇతర కాంగ్రెస్ నాయకుల కృషి ఫలించింది. ఇసకేస్తే రాలదు అంటే అతిశయోక్తికాదనిపించింది....
పేజీలు : 160