విద్యార్ధులలో గణిత శాస్త్రంపై ఆసక్తిని రేకెత్తించుటకు గణిత శాస్త్రజ్ఞులను పరిచయం చేస్తూ వారు గణితాభివృద్దికి చేసిన కృషిని వివరించుటయే ప్రధాన ధ్యేయంగా ఈ పుస్తకం వ్రాయబడినది. గణిత శాస్త్రజ్ఞుల పేర్లు , వారి ఫోటోలు సాధ్యమైనంత వరకు సేకరించి తేది వారీగా, నెలవారిగా వారి జనన మరణ తేదీల వరుసలో వ్రాయబడినవి. పాఠశాల లోని విద్యార్ధులు ఏ నెలలో ఏ రోజు ఏ గణిత శాస్త్రజ్ఞుని ప్రాముఖ్యత (జనన, మరణ) గలదో గమనించి ఆ రోజు ఆ గణిత శాస్త్రజ్ఞుని గణిత కృషిని ఘనమైన నివాళి అందించుటకు వీలుగా ఈ పుస్తకము వ్రాయబడినది. నా ఈ ప్రయత్నంలో నాకు ప్రోత్సాహమిచ్చి సహకరించిన గౌ||డా.యల్. రాధాకృష్ణ F.R.A.S (Londan) , గౌ|| ప్రొఫెసర్ P.V అరుణాచలం  (Former vice Chancellor), శ్రీ భావనారి సత్యనారాయణ (Associate ప్రొఫెసర్ నాగార్జున యూనివర్సిటీ  ) Dr. D.S.N శాస్త్రి  (Principal A.J Collee o Education ,మచిలీపట్టణం) రీ ప్రఖ్య సత్యనారాయణ శర్మ (ఎడిటర్ - గణిత చంద్రిక) గార్లుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good