ఈ ప్రపంచంలో కొందరు చరిత్రని సృష్టిస్తారు – మరికొందరు ఆ చరిత్రకు కొత్త పేజీల్ని జోడిస్తారు. ఎందరో ఆ చరిత్రలో కల్సిపోతారు.
చరిత్రని సృష్టించే వాళ్లు లెజెండ్స్...
చరిత్రని ముందుకు నడిపించే వాళ్ళు సమర్దులు...
చరిత్రలో కలిసిపోయేవాళ్ళు సామాన్యులు... పంజాబ్లో ఓ మారుమూల గ్రామం బౌన్లో (ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది) పుట్టిన ఓ కుర్రవాడు తరుచూ కలలు కంటుండేవాడు.
గోధూళి పదఘట్టనలో మరుగునపడి వున్న బౌన్ గ్రామం గురించి ఎవరికీ తెలీదు – దానికంత ప్రాముఖ్యం కూడా లేదు. అలాంటి ఏమాత్రం ప్రాముఖ్యత, గుర్తింపు లేని గ్రామం నుంచే ఆ కుర్రాడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు.
1839లో సవ్సారీలో జన్మించి బొంబాయిలో పెరిగిన జెమ్షెడ్జీ టాటా తండ్రి, సుస్సెర్వాన్జీ టాటా వ్యాపారం ఆరంభించి దెబ్బ తిన్నాడు. పుట్టటం డబ్బులో పుట్టినా – ఎదిగేసరికి పేదరికం జెమ్షెడ్జీ టాటా కల్లెదుట నిలిచింది.
అయినా ఒక గొప్ప అనుభవాన్ని (నష్టపోవటం) తండ్రి నుంచి నేర్చుకున్నాడు.
ఆపైన ఒక కొత్త చరిత్రని సృష్టించాడు. ఆ చరిత్ర పేరు టాటా ఇండస్ట్రియల్ ఎంపైర్ ఇన్ ఇండియా.

Write a review

Note: HTML is not translated!
Bad           Good