రామాయణం పాలసముద్రం. వాల్మీకి బుద్ధి మందర పర్వతమై చిలికింది. సీత లక్ష్మీ, సుగ్రీవుడు, అంగదుడూ మొదలైన వాళ్ళు కల్పవృక్షాలు. లక్ష్మణుడు చంద్రుడు. హనుమంతుడు చింతామణి, విభీషణుడు అమృతం. రావణుడు హాలాహాలం. ఈ రామాయణ క్షీరసముద్రం సుఖమూ శ్రేయస్సు కలిగించుగాక! అన్నారు శంకరాచార్యులు.
రామాయణ ఆదికావ్యం, మహాకావ్యం, క్రౌంచవధతో కన్నీరు కార్చి ఛందసాక్షాత్కారం పొందిన ఆదికవి వాల్మీకి కవితా మందాకిని భారత భూమిని పరవళ్ళు తొక్కింది. వాల్మీకి కవి భగీరధుడయ్యాడు. సాగర సంతతి వంటి భారతజాతి తరించింది. రామాయణ ప్రశస్తి జగద్విదితమైంది. ప్రపంచమంతా దీనికి జేజేలు పట్టింది. మానవజాతి వున్నంత కాలమూ జేజేలు పడుతూనే వుంటుంది. రామకథ స్మరించని భారతీయుడెవడు? జావా, ఇండోచైనా, తూర్పు దీవులూ మొదలైన మూల మూల దేశాలలోనూ ఏనాడో వ్యాపించింది. గరోసియా పండితుడు ఇటలీలోకి అనువదించాడు. రామాయణంలేని వాజ్మయం విశ్వంలో వాజ్మయమే కాదు ఈనాడు.
రామాయణమూ, భారతమూ సూర్యచంద్రులు. లోకానికి రెండూ రెండు హిమాలయ శృంగాలు. ఒకటి గంగ అయితే మరొకటి యమున. ఆంధ్ర ప్రజలకు భారతం అభిమాన గ్రంథమైతే రామాయణం ఆరాధ్యగ్రంథం.
నిన్నటి తరానికి నేటి తరానికి వారధిగా, గొప్ప దేశభక్తుడుగా, ప్రజల నాల్కల మీద నర్తించే భాషను కావ్యేతిహాసాలకు అన్వయించి వాడుక భాషకు కావ్యగౌరవం కల్పించి తెలుగు వచన రచనా శైలీ నిర్మాతలలో విశిష్టమైన స్ధానం పొందిన శ్రీ పురిపండా అప్పలస్వామిగారు వ్యావహారిక భాషలో రాసిన వాల్మీకి రామాయణమిది. మూడు భాగాలుగా వెలువడింది. కావలసినవారు మూడు భాగాలు ఒకే మారు తీసుకోవలసి ఉంటుంది.
Rs.630.00
Out Of Stock
-
+