విద్యారంగంలో, బోధన క్షేత్రంలో విశేషానుభవమున్న డా|| సాంబమూర్తి గారు అత్యంత వైవిధ్యంతో కూడుకున్న అంశాలపైన గుళికల్లాంటి వ్యాసాలు రచించారు. మానవ జీవనంలోని ఎన్నెన్నో అంచులను స్పృశించే అంశాలు ఈ వ్యాసాల్లో ఉన్నాయి. విద్యా విజ్ఞానాలను గురించి, పండగలూ, పబ్బాలను గురించి ప్రపంచాన్ని గురించి, ప్రముఖ వ్యక్తులను గురించి కొండను అద్దంలో చూపినట్టుగా ఈ వ్యాసాలు ఎంతో ప్రయోజనాత్మక రీతిలో విశ్లేషిస్తున్నాయి.

విషయాన్ని ఔచిత్యం మీరకుండా చెప్పడం, ఆ వివరించే విధానం పరమ పఠనీయ శైలిలో ఉండడం ఈ వ్యాస సంపుటికి వన్నె తెచ్చిన లక్షణాలు. విద్యార్ధులకే కాకుండా విద్యావంతులకు కూడా ఉపయోగకరంగా ఉండే ఈ లఘుతర వ్యాస సంపుటిని రచించిన డా|| సాంబమూర్తి గారు అభినందనీయులు. నీల్‌ కమల్‌ పబ్లికేషన్స్‌ వారి ప్రచురణగా వెలువడిన ఈ ''వ్యాసమంజూష'' విద్యాలయాల్లోనూ, గ్రంథాలయాల్లోనూ ఉండవలసిన అవసరం ఎంతైనా వుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good