ప్రాప్తాన్ని నమ్ముకు కూర్చుంటే.... నీవు వట్టి మనిషివి, నిన్ను నువ్వు ఆవిష్కరించుకుంటే అణుశక్తివి !

నాయకుడు తన అనుచరులని లక్ష్యం దిశగా నడిపించాలి అతని మాటలు మెదడుని కాక మనసుని తాకాలి హృదయపు తలుపులని తెరిచే తాళం చెవి 'కథ'.

ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యక్తులకి, సంస్థలకి తమ ప్రతిభను నిరూపించుకోక తప్పదు. అందువల్ల అన్ని రకాల నైపుణ్యాలను వాళ్లు పెంచుకోవాలి. వారి విజయాలకు స్ఫూర్తినిచ్చేవి పుస్తకాలే! అవి పాశ్చాత్య దేశాల పుస్తకాలే కానక్కరలేదు. మన పంచతంత్ర కథలు చాలు! మూర్ఖులైన రాజకుమారులను కేవలం ఆరు నెలల్లో రాజనీతిజ్ఞులని చేసిన గ్రంథం 'పంచతంత్రం'. ఈ కథలలో వచ్చే సింహం, పావురం, కాకి, ఎలుక, తాబేలు.... స్వీయ నాయకత్వానికి, పరస్పర స్నేహానికి, ధైర్యంతో, పట్టుదలతో ఆపదలు అధిగమించడానికి ప్రతీకలు.!

Write a review

Note: HTML is not translated!
Bad           Good