మింగుడు పడని వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని చేదు మందుకు తేనె కలిపి తాగించినట్లు, చక్కటి కథలతో వాటిని చెప్పిన తీరు బావుంది. ముఖ్యంగా 'మనసా రిలాక్స్ ప్లీజ్' అన్న పేరే ఈ పుస్తకం పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అల్లా వున్నాడు. కృష్ణ భగవానుడున్నాడు. క్రీస్తు, బుద్ధుడు, మహావీరుడూ ఉన్నారు.... వారు చెప్పిన సత్యాలెన్నో ఇందులో ఉన్నాయి. దైనందిన జీవితంలోని సమస్యలు, సంఘర్షణల నుంచి పారిపోవాలని ప్రయత్నించే వారిని అనునయించి నాలుగు ఓదార్పు మాటలు చెప్పగలిగిన బాధ్యతను ఈ పుస్తకం తీసుకుంది. - చిరంజీవి
కార్పోరేట్ ప్రపంచాన్ని, దాని నాయకులను వేధిస్తున్న వాటి గురించి స్వామిజీ స్పష్టంగా ఉన్నారు. పోటీదారు కన్నా ముందంజలో ఉండటమే అత్మను పిండే నిరంతర పోరాటంగా ఉంటోంది. ఇంతవరకు ఏ కార్పోరేట్ గురు చేయని ప్రయత్నాన్ని వీరు చేస్తున్నారు. పరస్పరం సంఘర్షించే రెండు భావాల మధ్య సామరస్యాన్ని సమకూరుస్తున్నారు. హింసాపూరిత కార్పోరేట్ పోటీ రంగంలో గ్లాడియేటర్గా ఉంటూనే అంతరంగంలో ప్రశాంతంగా ఉండాలంటారు. - బిజినెస్ స్టాండర్డ్
Rs.200.00
In Stock
-
+