సంప్రదాయ వ్యాకరణాల్లో చర్చించబడ్డ సంధి, సమాసాలు మొదలైన అంశాలతోపాటు వాక్యం, జాతీయాలు, సామెతలు - పొడుపు కథలు మొదలైన అంశాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. ఇవికాక అనుబంధంలో చూపిన వ్యుత్పత్త్యర్ధాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, జాతీయాలు, ప్రకృతి వికృతులు, ధ్వన్యనుకరణ పదాలు, పారిభాషిక పదాలు విద్యార్ధి భాషా విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.
అలంకారాలు, ఛందస్సు వ్యాకరణాంశాలు కాకపోయినా ఆనవాయితీగా ఈ వ్యాకరణ మంజూషలో చోటుచేసుకున్నాయి.
గ్రంధకర్త డా||డి.సాంబమూర్తిగారు చిరకాల బోధనానుభవం కలవారు. విద్యార్ధుల భాషా సమస్యలను బాగా ఎరిగినవారు. కనుకనే తమ ఈ వ్యాకరణంలో ఆధునిక పద్ధతులను మేళవించి చక్కని వ్యాకరణస్త్ర గ్రంథంగా రూపొందించినారు. ఇంతకుముందటి వ్యాకరణాలకంటే ఇది విలక్షణమని చెప్పవచ్చు. డా|| సాంబమూర్తి గారికి నా శుభాకాంక్షలు.
Rs.60.00
Out Of Stock
-
+