'ఈ జీవిత కథలోని మొదటి అద్భుతం - అపూ చూపునుంచి రాసిన పథేర్‌ పాంచాలి వలె...కృష్ణమూర్తి ఒక యాభై ఏళ్ల జీవితపు జ్ఞానం నుంచి వైదొలగి బాల్యంలో ప్రవేశించి నవ యవ్వనం దాకా నడచిన తాజాదనం (ఫ్రెష్‌నెస్‌) అంతా ఇందులో ఉంది. ఒక్క కృష్ణమూర్తే గాదు, ఆయనలోకి మన తెలంగాణ, నలగొండ జిల్లా, సూర్యాపేట, అనంతారం 1940లోకి వెళ్ళిపోయి స్వచ్ఛమైన రుతువులతో, జానపద గీతాలతో, కులభావన లేని కులాలతో, పల్లెలుగా వృత్తులతో, పండుగలతో, పేదరికంతో, ప్రేమలతో, సమిష్టి కుటుంబాలతో, స్నేహాలతో, స్నేహ క్రీడలతో, పోరాటాలతో జీవితాన్ని అంది అందివచ్చినట్లుగా అతి సహజంగా తీసుకుని 1958లో ప్రవేశించిన వైనం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను చూడకుండా ఉంటుందా? అందులోనూ తెలంగాణలో.

...అందుకే మళ్ళా అంటున్నాను - ఇది అపూ సంసారం (అపూర్‌ సంసార్‌) లో ప్రవేశించక ముందటి 'పథేర్‌ పాంచాలి'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good