ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది' - గురజాడ
'దేశ నిర్మాతలు మీరు కాదు. మేము. అభివృద్ధి క్రమంలోని అన్ని దశలలో మా చురుకైన సహకారం లేకుండా మీ కాంగ్రెసులూ, మహాసభలూ నిష్ప్రయోజనం. మీ స్త్రీలను విద్యావంతులను చేస్తే చాలు దేశం బాగుపడుతుంది. నిన్నా, నేడూ, రేపూ, మానవ జీవితం ఉన్నంత కాలం ఇది సత్యం. ఉయ్యాలలూపిన చేతులు ప్రపంచాన్నీ పరిపాలిస్తాయి.' - సరోజినీ నాయుడు
'యుద్ధం ఆవరించి శాంతికోసం తపిస్తున్న ప్రపంచానికి ఆ అమృతాన్ని అందజేసే విద్య స్త్రీ వద్దనే ఉంది. పుస్తకాలలో దొరికే విద్య అవసరం లేని సత్యాగ్రహానికి, బాధల నుంచీ, విశ్వాసాలనుంచీ వచ్చే దిటవైన హృదయం కావాలి. అలాంటి సత్యాగ్రహానికి నాయకత్వం వహించే శక్తి స్త్రీకే ఉంది. - గాంధి
'గడిచిన శతాబ్దం స్త్రీల శతాబ్దం. మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలూ, మొదటిగా వితంతు వివాహం చేసుకునే సాహసం చేసిన స్త్రీలూ, స్త్రీ విద్య కోసం ఉద్యమించిన స్త్రీలూ, ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళేందుకు తెగించిన స్త్రీలూ, నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారిగా అడుగిడిన స్త్రీలూ, మొదటి తరపు డాక్టర్లు, శాస్త్రవేత్తలు,సంగీత విద్వాంసులు, నర్తకులు, విద్యాధికులు - తలుచుకోగానే ఒళ్ళు పులకించే స్త్రీ మూర్తులెందరో'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good