తెలుగులో స్త్రీవాదాన్ని ఒక తాత్విక శక్తిగా నిలపగలిగిన ఓల్గా లోతైన, పదునైన శక్తితో కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించారు. ఆమె కథలలో కనిపించే పాత్రలన్నీ ఊహా ప్రపంచానికి సంబంధించినవి ఎంతమాత్రం కావు. అవి నిర్ధిష్ట వాస్తవికతలోంచి, ఆ వాస్తవికతలో వున్న అసమంజసత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చినవే. అవి రక్తమాంసాలు నిండిన పాత్రలు. స్వేచ్ఛలో మాత్రమే ఉండదగిన పాత్రలు. ఆమె పాత్రలు చేసే స్వేచ్ఛాభావనలు కాల్పానిక భావావేశంలోంచి వెలువడేవే గాక నిర్దిష్టతలోంచి వెలువడిన పాత్రలు. అంతకంటే ముఖ్యంగా స్వేచ్ఛకు సంబంధించిన విభిన్న భావనలను ఆమె పాత్రలు చర్చకు పెడతాయి. స్వేచ్ఛ గురించి అంతవరకు వున్న భావాలలో వెలువడిన అమూర్తతను నిరాకరిస్తూ ఓల్గా నిర్దిష్టంగా రూపుదిద్దుకున్న స్వేచ్ఛాభావనలను గురించి మాట్లాడతారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీలకు తమదైన స్పేస్‌ అనేది లేకపోవడం గురించి అందులో వుండే హింస గురించి కూడా ఆమె వ్రాశారు. స్త్రీల భావాలను, స్త్రీ వాదాన్ని వర్తమాన సమాజం, ముఖ్యంగా అభ్యుదయవాదులు ఆలోచనాపరంగా ఆమోదిస్తున్నప్పటికీ అవి ఆచరణలో పెట్టబడినప్పుడు నిరాకరిస్తున్న తీరులో వున్న ద్వంద్వ స్వభావాన్ని గురించి కూడా ఓల్గా ఘాటుగా కథలలో విమర్శించారు.

ఓల్గా కథానికలలో ఎక్కడా పురుషద్వేషం వ్యక్తమవదు. ఈ సమాజంలో పురుషులు అలా ప్రవర్తించడానికి గల కారణాల పట్ల రచయిత్రికి స్పస్టమైన అవగాహన వుంది. అందుకే తమ కసి అంతా పురుషులపైన కాదు. స్త్రీలు ఇలా ప్రవర్తించాలి, ఇలా వుండకూడదు అని నిర్దేశించిన పితృస్వామ్య సమాజంవైపే తన కలాన్ని సంధించి సామాజిక దృక్పథంతో ఓల్గా కథనాన్ని నిర్వహించిన తీరు ప్రశంసనీయమైంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good