ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య తత్త్వ విజ్ఞానశాస్త్ర ఖని, కవి, పండితుడు, యోగి అయిన శ్రీ ఆనందాచార్యస్వామి మహర్షి అనుభవమూర్తి ఆదేశాలు 'వివేకశిఖరాలు'. హిమాలయాలలో నార్వే పర్వతాలలో వారి ఏకాంత వాసాలు బ్రహ్మానందానుసంధానసంపన్నాలు. వారి వాక్కులు ప్రాకృతిక జీవిత రుజాపీడితులకు సంజీవని రసధారాశీకరాలు.
ప్రతి సాహితీ స్రష్ట కొక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అందుకోడానికి విశ్వ శ్రేయస్సాధన రూపంగా సాగేదే రచన. ఈ సృష్టి చేసే విధానంలో నాటిన మొక్కలు పెరిగి పూచే పూలు, కాచే పండ్లు క్షుత్పిపాసా నివారకాలుగా ఆ నీడలు విశ్రాంతి తలాలుగా కూర్చే సంతృప్తిని పొందడం కంటే పరమార్థమేముందా తోట మాలికి? లౌకికంగా అలౌకికంగా ప్రాణి పొందే హాయిని దృష్టిలో పెట్టుకుని సాగిన బాటలలో విహరించే సాహితీమతల్లిని ఆరాధించే పూజారి నలుబది వసంతాల నడక సాగిన 'శాంతి తీరాలకు'.... ఈ లోపల ప్రభు శక్తిపెట్టిన బాధ ప్రజాశక్తి పొందిన విజయం వ్యక్తి వేదన సంఘ స్వరూపం భిన్నత ఏకత సమకూర్చిన సందడులు ఇంకా ఎన్నో...   

Write a review

Note: HTML is not translated!
Bad           Good