ఒలింపిక్స్లో భారతదేశానికి పతాకాలు రావటం లేదని ఒలింపిక్స్ జరుగుతున్న ప్రతీసారి ప్రతీ భారతీయుడు మనం సాధించలేమా మనకి ఏమి తక్కువ అని బాధ పడేవాడే! నిజానికి మనలో ఆ సత్తా వుంది. దేశంలో ఒలింపిక్స్ మెడల్ సాధించడానికి ఏ విధమైన ప్రణాళిక లేనప్పటికీ కూడా మనకి ఒకటి రెండు పతకాలు వస్తున్నాయి. దీని అర్థం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వుంటే తప్పనిసరిగా మనం కూడా పది పతకాలు పైన సాధించగలం.
మన దేశ జనాభా 130 కోట్లలో సుమారు 2 శాతం నుండి 4 శాతం వరకు మాత్రమే క్రీడల యందు పాల్గొంటున్నారు. అందులో 70% పురుషులు, 30% మహిళలు పాల్గొంటున్నారు. అతి తక్కువ శాతంలో పాల్గొన్న మహిళలు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో పురుషుల కన్నా ఎక్కువ పతకాలు తెస్తున్నారు. పాల్గొనేవారు తక్కువగా వున్నప్పుడు క్రీడాంశాలు కూడా తక్కువగానే ఉండాలి. అదేవిధంగా కబడ్డీ, ఖో ఖో, బాల్ బ్యాడ్మింటన్ మరియు ఒలింపిక్స్ అంశాలకి మాత్రమే ప్రాధాన్యత కల్పించాలి. అలాగే క్రీడ కోటాలు ఉద్యోగాలు కూడా ఈ అంశాలకే ఇవ్వాలి.....
- శ్రీనివాస్ కుమార్ బడి
పేజీలు : 60