నిత్య జీవితంలో సైన్స్‌తో ముడిపడివున్న ఎన్నో సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం లేవడం మొదలు రాత్రి పడుకునేవరకు మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించే ఎన్నో వస్తువులు, పరికరాలు సైన్స్‌ సూత్రాలపై ఆధారపడి తయారయినవే. ఈ ఆవిష్కరణల వెనుక ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనా నైపుణ్యాలు దాగున్నాయి. వారి కృషి ఫలితంగా నేడు మనం ఎంతో సులభంగా కొత్త కొత్త విషయాలను మరింత సులభంగా అవగాహన చేసుకుంటున్నాం.

ఉన్నత పాఠశాల విద్యార్థులకెంతో ఉపయోగపడే ఈ పుస్తకంలో మన భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు తమ అన్వేషణలో అంచెలంచెలుగా ఎలా అభివృద్ధిని సాధించారో, తద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు ఎలా దీప్తివంతం చేశారో తెలుస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good