మృగ ప్రాయుడి దశనుంచి ప్రారంభించిన మానవుడు విజ్ఞానం ద్వారా ఒకొక్క మెట్టే పైకి ఎక్కుతూ , నాగరిక మానవుడుగా పరిణమించ గలిగాడు. రాతి ఉలులు నుండి ఈనాడు శాస్త్ర చికిత్సకు ఉపయోగించే పరికరాలను రావతమంటేనూ , చుకుముకి ములుకులు బాణాలతో పరిగెత్తే వేట మృగాలను అందుకోవటం నుంచి, రాకెట్లు సహాయంతో శుక్ర , అంగారక గ్రహాలకు అందుకోవటం దాకా రావటమంటేనూ , అది యంతటి వైజ్ఞానిక పురోగమనమో మనం మరచిపోరాదు. ఈనాటి కింకా ఆటవిక జీవితం గడిపెవారిని , నాగరిక మానవులూ పోల్చి చూసినా వ్యత్యాసం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. మనలాంటి వాళ్ళం విజ్ఞానాని అనువదించు కోవలసిన దుస్థితిలో ఉన్నాం. ఈ అనువాదం ఒక యజ్ఞం లాంటిది. వైజ్ఞానిక భావాలు సామాన్య ప్రజల కర్ధమయ్యే సినిమా ధోరణిలో ఉండదు. విజ్ఞానికి ఒక పరిభాష ఉంటుంది. అది సామాన్యులకు పరిచితమైనదికాదు. అటువంటి అనందం చేకూర్చగల పుస్తకం ఈ విశ్వరూపం. ఈ పుస్తకం మనకు పరమాణువులు మొదలుకొని అనంత విశ్వం దాకా వివిధ విషయాలను గురించి ఎన్నో విషయాలు వివరించబడ్డాయి. ఈ పుస్తకం తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలు  రాయిగా నిలబడుతుంది. అనటానికి నాకు ఎలాంటి సందేహమూ లేదు.అంతేకాదు దీనిని చదివిన యువకులలో వైజ్ఞానిక తృష్ణ మరితంగా పెరిగి జన సామాన్యంలో విజ్ఞాన వ్యాప్తి కలుగుతుందని కూడా ఆశిస్తున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good