మేము సన్నకారు రైతులము, చిన్నరకమురచయితలము. మాకు పాండిత్యము లేదు, కవిత్వము రాదు. ఆస్తిపాస్తులు అంతంత మటుకే. అంతస్తులు అనరాదు. అధికారం వినరాదు. కులము, గోత్రము వుండీ లేని వారము. పట్నవాసాలెరిగిన పల్లెటూరి వారము. పట్టణాల పాదధూళి, పల్లెటూర్ల పైరుగాలి పీల్చుకున్న కృషీవలురము.
చదువు సంధ్యలు అంతంత మట్టుకే. ఇంగిలీసు, తెలుగులో కాస్తోకూస్తో అక్షరం తెలివి వుంది. ఇక భక్తిలోనో ఫస్ట్‌ఫారమే ఫెయిల్ అయినాము. సాహిత్యవేత్తలము కాము, కానీ అభ్యుదయ సాహిత్యమంటే చెవులు కోసుకొని, నోరూరించు కుంటాము. మేము గ్రంథకర్తలము కాము, సంఘ సంస్కర్తలము మాత్రమే. కావ్య కర్తలము కాము, కార్యకర్తలము మాత్రమే.
నన్నయ, తిక్కన, నాచన. కేతన, పోతన, శ్రీనాథ, మారన, మల్లన, మొల్ల సూరన, సోమన, భీమన, మొదలగు కవి పెద్దన్నల కన్న చిన్నన్న, వేమన్న మాకు ఆదర్శ ప్రాయుడు. అభినందనీయుడు. కారణం? దీన జనావళికి దివ్య సందేశ మందించినాడు. సంఘోద్దరణకు సమరం సాగించినాడు. కుల, మత, జాతి, భాష, దురభిమాన, దురహంకార దుష్కృత్యాలను దుయ్యబట్టి, ధ్వజమెత్తినాడు, సోదరభావం సమతా దృక్పథం, ఎలుగెత్తి చాటినాడు. దీనికి ప్రతి ధ్వనియే ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good