ఉదయం లేవగానే మనం ఎంతో ఆత్రంగా చదివే వార్తా పత్రికలోని అధికభాగం విలువ, ఆ సాయంత్రమో, మర్నాడో యింకో పత్రిక రాగానే, చాలావరకు తగ్గిపోతుంది. అలాగే, ఏ కొద్ది పుస్తకాలో తప్ప అధికభాగం ప్రచురణలు పునరపి పఠనం...పునరపి పఠనంకి నోచుకోలేక పోతుంటాయి. జాన్ రస్మిన్ అన్నట్లు ప్రపచంలో ఎన్నో పుస్తకాలు తాత్కాలిక విలువలనీ కలిగి వుంటే, కొన్ని పుస్తకాలు మాత్రం మారే కాలంతో మారని విలువుల వుండటం వల్ల శాశ్వతంగా నిలిచి పోతుంటాయి.
అలా శాశ్వతంగా నిలిచిపోయేవే - అక్షరాలు!
సత్వరమైన జగత్తులో అసత్వరంగా ఉండిపోయే అక్షరాలు విశ్వవ్యాప్తంగా ఎందరో మహానుభావులు అందించిన అద్భుతమైన సూక్తుల సారం నిండిన కమ్మదనాలు!!!