మనుషులందరూ కవులేనంటారట ఎస్కిమోలు. మనుషులందరూ కవులే కాదు, కథకులు కూడా:
           ఇక చక్రపాణి గారు కూర్చిన ఈ కదంబంలోని కథలన్నీ క్లాసిక్స్ అనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ సుప్రసిద్ధ కథల సమాహారం. ఇది కథల విందు. కథాప్రియులకు జాక్పాట్. 28మంది రచయితలు, 58 కథలు (38 మంది రచయితలు + 69 కథలు). ప్రపంచసాహిత్యాన్నీ, భారతీయ భాషలలోని కథలనూ ఒకచోట చేర్చిన Omnibus Edition తెలుగులో రావడమే ఒక అద్భుతం! 
           ప్రపంచ కథా సాహిత్యంలో మన స్థానమేమిటో ఎవరి ప్రభావం మన మీద ఎంతగా ఉందో తెలుసుకోవడానికి, తులనాత్మక అధ్యయనానికి ఈ విశ్వ కథా కదంబం మంచి అవకాశం. దీన్ని ఆధునిక కథాసరిత్సాగరమంటే అతిశయోక్తి కాదు.
            ఈ పుస్తకంలోని కథలన్నీ చదివితే ప్రపంచమంతా ఒకసారి చుట్టివచ్చిన అనుభూతి కలుగుతుంది. విశ్వ విఖ్యాతులైన కథకులందరూ మనకిందులో దర్శనమిస్తారు.   -కాకాని చక్రపాణి

Write a review

Note: HTML is not translated!
Bad           Good