'విస్మృత యాత్రికుడు'లోని చాలా భాగాలు ఢిల్లీ నుండి వెలువడే 'సాప్తాహిక' 'హిందుస్థాన్‌' పత్రికలలో ధారావాహికంగా వెలువడ్డాయి.  అవి చదివిన మిత్రులు అనేక మంది ఆసక్తిదాయకమైన ఉత్తరాలు వ్రాశారు. తమ తమ సందేహాలు వెలిబుచ్చారు. నేను వ్రాసిన ''సింహ సేనాపతి'' చదివి పీఠికలో వ్రాసిన 'యిటుకలను' దర్శించడానికి చాలామంది మిత్రులు పాట్నా - మ్యూజియంకు పరుగెత్తారు కూడానూ. నిజంగా అదంతా యథాతథంగా వ్రాయబడి వుంటే అప్పడది నవల అవదు. ఇటుకల దర్శనార్థమై వచ్చిన మిత్రులు, అది ఒక చారిత్రాత్మకమైన నవల అనీ, తత్కాలీన దేశకాల పాత్రల పరిధి నుండి వెలికి రాలేదని గ్రహించి వుండవలసింది. అలాగే 'విస్మృత యాత్రికుడు'ని గురించి కూడా అనేక మంది ప్రయత్నించారు. నా చారిత్రక రచనలన్నీ నవలలే. చరిత్రలుగానీ, జీవిత చరిత్రలుగానీ కావు.

రాహుల్‌ సాంకృత్యాయన్‌

పేజీలు : 351

Write a review

Note: HTML is not translated!
Bad           Good