స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వివిధ రంగాలలో స్త్రీలను ప్రోత్సహించడం కొంత తక్కువే అయినా కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభించిన వారు తాము కోరుకున్న రంగాలలో అభివృద్ధి సాధించారు. తద్వారా మానవ జాతికి ప్రత్యేకించి మహిళాలోకానికే ఆదర్శమూర్తులుగా, విశిష్ట మహిళామణులుగా చరిత్రలో నిలిచిపోయారు.

                ‘ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు అనే కాలంలోనే పుట్టినా తమ చుట్టూ ఉన్న దుష్ట సంప్రదాయ సంకెళ్ళను ఛేదించుకుని ఆదర్శాలు పాటించినవారు, విమర్శలనెదిరించి తమ నైపుణ్యాలతో విమర్శకుల నోళ్ళు మూయించిన వనితలు కొందరున్నారు. జీవితమంటే పూలపాన్పుకాదని, ఒడిదుడుకులకు ఎదురునిలిచి వాటికే ముచ్చెమటలు పట్టించేవారు, స్వప్రయోజనాలను మరిచిపోయి రోజుకు ఉన్న ఇరవై నాలుగు గంటలు చాలవన్నట్లు సేవచేసేవారు, అవయవ లోపాలను విస్మరించి ఎంతటి కష్టాలకడలినైనా తమ ఉన్నతికి అనుగుణంగా మలచుకునే శక్తిసామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం కలిగిన మహిళామణులు మరికొందరున్నారు.

                స్వంతపనులను సైతం ప్రక్కనపెట్ట తాము ఎంచుకున్న రంగాలనే శ్వాసించి చివరకు వాటినే శాసించే స్థాయికి ఎదిగి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించుకున్న కొందరు విశిష్ట నారీమణులనైనా నేటి బాలలకు పరిచయం చేయడమే రచన ముఖ్య ఉద్దేశ్యం.

పేజీలు : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good