శ్రీమతి శాంతాభాస్కర్‌ రచించిన విశిష్ట మహిళామణులు గ్రంథంలో 21 మంది స్వదేశీ విదేశీ, ఆదర్శ మహిళల జీవన చిత్రాలు ఆవిష్కరించబడి వున్నాయి. వీరిలో ప్రపంచ మానవజీవన వికాసానికి పలురంగాలలో కృషి చేసినవారు, సాహిత్య కళారంగాలలో జీవితాలను అర్పించినవారు, విశేష ప్రతిభ కనబరచిన స్వాతంత్య్ర సమరయోధురాండ్రు, సమాజసేవికలు, అంతరిక్ష పరిశోధనలు చేసినవారు, అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో నెట్టుకుని పోతూ - ప్రజా సేవచేసినవారు, సంఘసంస్కర్తలు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, సంగీత కళలో నిష్ణాతులైన గాయనీమణులు మానవీయతను ప్రదర్శించిన వనితలు ఉన్నారు. ఈ పుస్తకం - రచయిత్రికి మానవాభ్యుదయం పట్ల గల ఆకాంక్ష ఎంతటి ఉదాత్తమైనదో గుర్తించవచ్చు - వివిధ రంగాలలో రాణించిన ప్రసిద్ధుల జీవిత గమనాలు భావితరానికి స్ఫూర్తిని ప్రసాదిస్తాయన్నది నిర్వివాదాంశం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good