Rs.30.00
Out Of Stock
-
+
మార్తాహర్నేకర్ చిలికి చెందిన ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారిణి. వెనిజులాలో సుదీర్ఘకాలం నివశించిన ఆమె లాటిన్ అమెరికాలో పరిణామాలను సోదాహరణంగా వివరించారు. మార్క్సిజాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవడమే కీలకమయిన విషయమని, వామపక్ష శక్తులలోనూ మార్పు రావలసి వుందని ఆమె అభిప్రాయం.
మార్క్స్ పెట్టుబడి స్వభావాన్ని కనుగొన్నారు. దాని ఆధారంగా ప్రవాహతీరును అంచనా వేయగలిగారు. కార్మికలోకానికి తన విముక్తి కోసం సిద్ధాంత ఆయుధాన్ని అందించగలిగారు. దానిని సమర్థవంతంగా వినియోగించుకోవలసిన బాధ్యత మనపై ఉంది.
కార్మికవర్గ విప్లవకర పాత్రపైన దృష్టిసారిస్తూనే సామాజిక వర్గంలో వచ్చిన నిర్దిష్ట మార్పులను, సంతరించుకుంటున్న కొత్తలక్షణాలను వంటపట్టించుకోవాలి. విప్లవంలో స్థానిక ప్రజలు పోషించగల పాత్రను అర్థం చేసుకోవాలి.
పేజీలు : 48