కొత్తకెరటం

'నేటి దోపిడీదారీ అధికార వ్యవస్థలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో నా విశిష్ట సభ్యత్వాన్నీ, మృతసాహిత్య రీతులకు ప్రతినిధి అయిన కవితాసమితిలో నా చిరకాల సభ్యత్వాన్నీ త్యజిస్తున్నాను.'

అంకురార్పణ తదుపరి తొమ్మిదినెలలకు విరసం సాధికారంగా ఆవిర్భవిస్తున్నదని శ్రీశ్రీ ప్రకటించారు. ఈ నవశిశువును జాగ్రత్తగా పెంచి పోషించుకోవాలని ఆయన ఉద్భోధించారు.

'ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిజం తన శక్తిని రుజువు పరిచినది. అట్టి మార్క్సిస్టు దర్శనానికే విప్లవ రచయితల సంఘం కట్టుబడి ఉంటుంది. ఆ విధంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడటం అంటే సంకెళ్లు వేసుకోవటంగా కొందరు భావిస్తారు. అయితే నిజానికది రచయితలకు శక్తినిచ్చే సాధనం.'

'కథలో, కవితలో ఊహాగానం వద్దు. నాటకాలలో మితిమీరిన కల్పన వద్దు. నేటి సమాజం, ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల దృష్ట్యా వాస్తవికదృక్పథంతో రచనలు చేయాలి. రచయితలపై సమాజపు ప్రభావం అనివార్యంగా ఉంటుంది.'

'వేలకొలది రచయితలు ఉన్నారు. అయినా అందులో 100 మంది విప్లవ రచయితలుంటే విప్లవం చేరువౌవుతుంది.'

'ఇక మాటలు అనవసరం. కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం విప్లవాత్మక దృక్పథంతో రచనలు చేయాలి'.

(ఖమ్మంలో 8-10-1970న జరిగిన విరసం తొలి మహాసభల ప్రతినిధుల సభలో మాట్లాడింది.)

Write a review

Note: HTML is not translated!
Bad           Good