మహాకవితో ఇంటర్వ్యూ
ప్రశ్న: శ్రీఎ గారూ, ఏరకం సాహిత్యాన్ని మీరు అభ్యుదయ సాహిత్యంగా పరిగణిస్తారు?
జవాబు : స్థూలంగా చెప్పాలంటే, మానవుని పురోగతికి ఉపయోగించేదే, నిర్దుష్టమైన బ్రతుకుబాటను చూపించేదే అభ్యుదయ సాహిత్యంగా పరిగణిస్తాను.
ప్ర: వీరేశలింగం, గురజాడలు-వారిద్దరినీ పూర్తిగా అభ్యుదయ కవులకింద జమకట్టవచ్చా లేదా? ఉభయుల్లో రియాక్షనరీ కంటెంట్ ఏమైనా వుందా? వుంటే ఏది? ఇద్దరూ సంస్కర్తలే కదా? వారిలో ఎవరి దృష్టి సమాజాభ్యున్నతిని ఎక్కువగా కోరేది?
జవాబు : ఒక విధంగా చూస్తే గురజాడ పైనుంచి కిందికి వచ్చినవారు. వీరేశలింగం కింది నుంచి పైకి వచ్చినవారు. వీరేశలింగం ప్రజల మనిషి, గురజాడ రాజావారి మనిషి, అయితే ఉభయుల హృదయాలూ నిష్కల్మషం. మానవరక్తం వారి హృదయాల్లో ప్రవహిస్తోంది. పరిస్థితుల్నిబట్టి వీరేశలింగం సెల్ఫ్-మేడ్ మ్యాన్ అయాడు. తన వూడల్లోంచి పెరిగాడు. గురజాడ మహారాజా భవనంలో పెరిగాడు. రాజాతోపాటు ఊటిలో గడుపుతూ వుండేవాడు. వారిద్దరి మధ్యాచెప్పుకోదగినంత వైరుధ్యమేమీలేదు. ఉదాహరణకి సెనగగింజ నుంచి రెండాకులు ఒస్తాయి. ఇద్దరూ కాసే రెమ్మలు. ఒకే పంథాలో సాగుతూ వచ్చారు. ఇద్దరిలోనూ రియాక్షనరీ కంటెంట్ లేదని నా అభిప్రాయం...
పేజీలు : 64