ఈనాటి ప్రగతిశీల మహిళా ఉద్యమాలకు ఆనాడు ఐలమ్మ చేసిన తిరుగుబాటే స్ఫూర్తి. బానిసత్వ సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించింది ఐలమ్మ. చదువు - టెక్నాలజీ అభివృద్ధిని ఉపయోగించుకొని లింగ వివక్షతను దూరం చేయాలి. అది ఒకరు ప్రసాదించేది కాదు. పాలకవర్గాలు ఐలమ్మ స్ఫూర్తిని శాశ్వతపరచి మహిళా సాధికారతను సాధించడానికి ఆమె జ్ఞాపకార్థం స్మృతి చిహ్నాల్ని ఏర్పాటు చేయాలి. ఐలమ్మ లాంటి మహనీయుల త్యాగమే చరిత్ర. ఆ చరిత్రను, చైతన్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. - చుక్కా రామయ్య

    ఐలమ్మ ఆదర్శ వనిత

    పోరాటానికి మరోపేరు

    అగ్నికణం ఐలమ్మ...ఐలమ్మ ఒక ఉద్యమం

    ఒక పోరాట చరిత్ర...స్ఫూర్తిదాయకమైన విప్లవ పాఠ్యాంశం

 

    ఐలమ్మ కడు బీద కుటుంబంలో జన్మించింది. ఐలమ్మ తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయులు. ఐలమ్మ వీరికి నాల్గవ సంతానం. వృత్తి రజక, వ్యవసాయ కూలీ. పోతిరెడ్డిపల్లి శివారు కిష్టాపురం, వరంగల్‌ జిల్లా, రాయపర్తి మండలం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good