అనగనగా, భారతదేశంలోని ఒక చిన్న ఊళ్లో, ఇద్దరు తెలివైన కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒకడు తన తెలివితేటలని డబ్బు సంపాదించేందుకు ఉపయోగించుకోవాలనుకున్నాడు. రెండోవాడు విప్లవం ప్రారంభించేందుకు తన తెలివితేటల్ని వాడుకోవాలని అనుకున్నాడు. అసలు సమస్య ఏమిటంటే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.
విప్లవం 2020కి స్వాగతం. చిన్ననాటి స్నేహితులు - గోపాల్, రాఘవ్, ఆరతి కథ. ముగ్గురూ వారణాసిలో విజయాన్నీ, ప్రేమనీ, సంతోషాన్నీ సంపాదించుకోవాలని చాలా కష్టపడి ప్రయత్నించారు. కానీ, అవినీతి పరులని అందలాలెక్కించే అన్యాయంతో నిండిన సమాజంలో వాటిని పొందటం సులభం కాదు. గోపాల్ వ్యవస్ధకి లొంగిపోతే, రాఘవ్ దానితో పోరాడి ఎదురు తిరుగుతాడు. ఎవరు గెలుస్తారు? అత్యధికంగా అమ్ముడుబోయే ఐఐటిలో అత్తెసరుగాళ్ళు, వన్నైట్ ఎట్ ద కాల్ సెంటర్, నా జీవితంలోని 3 పొరపాట్లు, రెండు రాష్ట్రాలు నవలలు. రచయిత కలం నుంచి మనసుకి హత్తుకునే ఇంకో కథ, ఈ సారి భారతదేశం నడిబొడ్డు నుంచి వచ్చింది. విప్లవానికి మీరు సిద్దమేనా?
Rs.140.00
Out Of Stock
-
+