మనిషి గొప్పవాడు కావడం, మహానుభావుడు కావడం, మహాత్ముడు కావడం చివరికి 'దేవుడు కావడం' ఒక పరిణామ క్రమం. 'దైవం మానుషరూపేణ' అనడం ఇందుకే. మనకు పురాణకథల ద్వారా తెలిసే దేవతలు చాలామంది ఉన్నారు. ఈ పురాణ దేవతలు కాక మనకు వేరే విధమైన దేవుళ్ళు కూడా ఉన్నారు. వారు మన మధ్య మనలాగే మనుషులలాగే ఉండి 'దేవతల స్థానానికి' చేరుకున్నవారు. అలాంటి దేవుళ్ళలో మన తెలుగు వారికి బాగా తెలిసిన దేవుడు 'శ్రీమద్‌ విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి' ఒకరు. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం మన మధ్య పుట్టి, మనుషుల ఉత్తమప్రగతికోసం ఉపయోగపడుతుందనుకున్న తాత్త్వికతని సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన యోగి వీరబ్రహ్మం. ఈయనను అవతార పురుషుడిగా భావించిన సామాజిక ప్రక్రమం, పురాణ సృజనాన్ని విశ్లేషించడానికి ఉద్దేశించింది ఈ లఘుగ్రంథం. వీరబ్రహ్మం సుమారు నాలుగు వందల సంవత్సరాల కాలం వాడు. కాగా నేటి కాలంలో కూడా కొందరు అవధూతలు, లేదా స్వాములు, లేదా బాబాలు దేవుడి స్థానాన్ని పొంది సజీవులైన దేవుళ్ళుగా కీర్తిని పొందుతున్నారు. వీరిని అవతారీకరణ చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది. ఈ అవతారీకరణ ప్రక్రియకు బ్రహ్మం కాలం నాటి అవతారీకరణ ప్రక్రియకు ఉన్న సంబంధం లేదా పురాణీకరణ ప్రక్రియ కొనసాగింపు ఎలా ఉంటుంది అనే ప్రక్రమాన్ని విశ్లేషిస్తుంది ఈ వ్యాసం. ఇక్కడ చేయబోయే చర్చకోసం వీరబ్రహ్మంగారి చరిత్రని లేదా కథని కుప్లంగానైనా పరిచయం చేయాలి. దానికన్నా ముందు వీరబ్రహ్మంగారి ఉనికి నేడు ఎక్కడెక్కడ ఎలా ఉంది అనే విషయాన్ని పరిశీలించాలి....

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good